News July 25, 2024
కేసీఆర్‌వి గాలి మాటలు: భట్టి
TG: మాజీ సీఎం కేసీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై ఆయన గాలి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ‘ఎవరిని చీల్చుతాడు? ఎవరిని చెండాడుతాడు? కేసీఆర్ గతంలో దళితబంధుకు ఒక్క పైసా ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రుణమాఫీ చేసి చూపించాం. భవిష్యత్‌లో కేసీఆర్‌కు మేం ఏంటో చూపిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 6, 2024
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 6, 2024
డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి
TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.
News October 6, 2024
ఐదో రోజు అట్ల బతుకమ్మ
TG: బతుకమ్మ పండగ నిర్వహించే తొమ్మిది రోజుల్లో రోజుకో విశిష్ఠత ఉంది. ఇవాళ ఐదో రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మర పట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఆడవాళ్లు వీటిని ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇవాళ బతుకమ్మను ఐదు వరుసల్లో వివిధ పూలతో చేస్తారు.