News December 15, 2024
క్రిస్టియన్ సంప్రదాయంలో కీర్తి సురేశ్ వివాహం

మహానటి హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో ఈ నెల 12న ఉదయం హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. తాజాగా క్రిస్టియన్ పద్ధతిలోనూ ఈ జంట పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Similar News
News April 11, 2026
రిస్కీ రీఎంట్రీ: 40,000kmph వేగం.. 2,760°C టెంపరేచర్

ఆర్టెమిస్-2 మిషన్‌లో రీఎంట్రీ అత్యంత రిస్కీ పార్ట్. 40,000kmph స్పీడ్‌తో భూవాతావరణంలోకి క్యాప్సూల్ దూసుకొచ్చింది. అప్పుడు పుట్టిన 2,760°C వేడికి ఓరియన్ క్యాప్సూల్ చుట్టూ ఎర్రటి ప్లాస్మా సెగలు కమ్మేశాయి. అప్పుడే 6 నిమిషాలు కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో హ్యూస్టన్ కంట్రోల్ రూమ్‌లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. హీట్ షీల్డ్ ప్రాణాలు కాపాడగా పారాచూట్లు విచ్చుకుని వ్యోమగాములు సేఫ్‌గా దిగడంతో రిలీఫ్ అయ్యారు.
News April 11, 2026
సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.
News April 11, 2026
వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It


