News April 10, 2024
సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిన్న ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో కేజ్రీవాల్ SCని ఆశ్రయించారు. అత్యవసర విచారణ కింద ఈరోజు ఉదయం.10.30గంటలకు CJI జస్టిస్ చంద్రచూడ్ ముందు ఈ పిటిషన్‌ను ఉంచనున్నారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.
Similar News
News March 25, 2025
జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే: భారత ప్రతినిధి

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత శాశ్వత ప్రతినిధి తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను భారత్‌కు వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. UNOలో పాక్ అనవసరంగా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకొస్తోందని, ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఆ ప్రాంతం భారత్‌కే చెందుతుందని అన్నారు. UNO శాంతి పరిరక్షణ చర్చలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రతినిధి లేవనెత్తగా భారత్ దీటుగా బదులిచ్చింది.
News March 25, 2025
‘ఆస్కార్’ గెలుపొందిన దర్శకుడిపై దాడి

‘ఆస్కార్’ గ్రహీత, పాలస్తీనా దర్శకుడు హందాన్ బల్లాల్‌పై వెస్ట్ బ్యాంక్‌లో దాడి జరిగింది. తొలుత సెటిలర్లు దాడి చేయగా ఆ తర్వాత ఇజ్రాయెల్ బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. హందాన్‌కు తల, కడుపుపై గాయాలయ్యాయని సన్నిహితులు తెలిపారు. అయితే అతడి అరెస్టుపై ఇజ్రాయెల్ బలగాలు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ‘నో అదర్ ల్యాండ్’ పేరిట పాలస్తీనాపై హందాన్, అతడి టీమ్ రూపొందించిన డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది.
News March 25, 2025
‘గూగుల్’ గురించి ఈ విషయం తెలుసా?

‘గూగుల్’ కంపెనీ తన ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు కోసం అమలు చేస్తోన్న ఓ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. ఆ కంపెనీ ఉద్యోగి మరణిస్తే వారి భాగస్వామికి పదేళ్ల పాటు 50శాతం శాలరీని ఇస్తోంది. అలాగే వారి పిల్లల్లో ప్రతి ఒక్కరికీ 19 ఏళ్లు వచ్చేవరకు నెలకు $1,000 (రూ.84వేలు) అందిస్తోంది. ఉద్యోగి కుటుంబం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కంపెనీ అండగా నిలవడం గ్రేట్ అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. మీరేమంటారు?