News March 28, 2024

కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేం: హైకోర్టు

image

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయన జైలులో ఉన్నందున సీఎంగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఇవాళ్టితో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

Similar News

News March 26, 2026

రేపే శ్రీరామనవమి.. ముహూర్తం ఇదే

image

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపు చైత్ర శుద్ధ నవమి రోజున ఉ.11.06 నుంచి మ.1.31 వరకు రఘురాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరుగుతుందంటున్నారు. మ.ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇక రేపు భద్రాద్రిలో 12pmకు సీతారాముల కళ్యాణం జరగనుంది.

News March 26, 2026

మా అనుభవాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం: సైనా నెహ్వాల్

image

తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించి బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్ గతేడాది వార్తల్లో నిలిచారు. అయితే కొన్నాళ్లకే కలిసిపోతున్నట్లు వెల్లడించారు. దీనిపై సైనా తాజాగా స్పందించారు. ‘బంధాల్లో విభేదాలు సహజం. వాటిని ఎలా పరిష్కరించుకుంటామనేదే అత్యంత ముఖ్యం. కమ్యూనికేషన్, నమ్మకం, పరస్పర గౌరవం, సహనం అవసరం. మా అనుభవాల నుంచి మేం నేర్చుకుంటూనే ఉన్నాం’ అని NDTV ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News March 26, 2026

అయ్యో.. పాపం!

image

AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఒక్కొక్కరి దీనగాథ హృదయ విదారకంగా ఉంది. కనిగిరి(M) మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45) తన కొడుకు మనోహర్‌ను కాపాడి తాను మరణించారు. కొనకనమిట్ల(M) పెదారికట్లకు చెందిన అంబటి అనిల్, 5 నెలల కొడుకు చనిపోగా అతని భార్య సౌజన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.