News March 28, 2024
కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేం: హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయన జైలులో ఉన్నందున సీఎంగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఇవాళ్టితో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Similar News
News February 11, 2026
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News February 11, 2026
ఏకాదశి: ఎల్లుండి ఉపవాసం ఉంటున్నారా?

ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే ఆ ఒక్కరోజే కాకుండా మూడ్రోజులు (ఏకాదశి, దశమి, ద్వాదశి) కలిపి ‘హరిత్రయం’ పాటిస్తూ ఉపవాసం ఉండాలంటున్నారు పండితులు. దీనివల్ల అధిక పుణ్యం లభిస్తుందట. నియమాలు.. దశమి నాడే ఉపవాస నియమాలు ప్రారంభించాలి. దశమి రాత్రి అల్పాహారం తీసుకుని, నేలపై పడుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ద్వాదశి ఘడియలు ముగిసేలోపే వ్రత సమాప్తి (పారణ) చేయాలి.
News February 11, 2026
SEBI 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<


