News March 23, 2024
కేజ్రీవాల్ CMగా కొనసాగడం చెత్త రాజకీయం: ఠాకూర్
లిక్కర్ స్కాం కేసులో ఈడీ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ పదవిలో కొనసాగడం సరికాదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వీటిని చెత్త రాజకీయాలు అని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉంటే ఆయన స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఆప్ లీడర్లు పోటీ పడుతున్నారని, కానీ.. ఈ రేసులోకి కేజ్రీవాల్ భార్య కూడా చేరారని బీజేపీ మంత్రి అన్నారు.
Similar News
News January 9, 2025
కొనసాగుతున్న విచారణ.. ప్రశ్నల వర్షం!
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి KTRను విచారిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? క్యాబినెట్, ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? నిధులు బదిలీ చేయాలని బలవంతం చేశారా? అని ప్రశ్నలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐలు మాజీ మంత్రిని విచారిస్తున్నారు.
News January 9, 2025
BITCOIN: 24 గంటల్లో రూ.2.5లక్షలు లాస్
క్రిప్టో మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. గత 24 గంటల్లో మార్కెట్ విలువ 1.65% తగ్గి $3.3Tకి చేరుకుంది. ఇక బిట్‌కాయిన్ 2.21% అంటే $3000 (Rs 2.5L) నష్టపోయింది. $97,443 వద్ద గరిష్ఠాన్ని టచ్ చేసిన BTC $94,500 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ డామినెన్స్ 56.5 శాతంగా ఉంది. $3,384 వద్ద గరిష్ఠాన్ని తాకిన ETH 1.02% నష్టపోయి $3,334 వద్ద కొనసాగుతోంది. SOL 1.26, DOGE 3.53, ADA 5.89, AVAX 4.35% పతనమయ్యాయి.
News January 9, 2025
మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.