News March 23, 2024

కేజ్రీవాల్ CMగా కొనసాగడం చెత్త రాజకీయం: ఠాకూర్

image

లిక్కర్ స్కాం కేసులో ఈడీ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ పదవిలో కొనసాగడం సరికాదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వీటిని చెత్త రాజకీయాలు అని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉంటే ఆయన స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఆప్ లీడర్లు పోటీ పడుతున్నారని, కానీ.. ఈ రేసులోకి కేజ్రీవాల్ భార్య కూడా చేరారని బీజేపీ మంత్రి అన్నారు.

Similar News

News September 10, 2024

సైబర్ నేరాల అడ్డుకట్టకు 5వేల సైబర్ కమాండోలు

image

జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగమని HM అమిత్ షా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఎదుగుదలకు అదెంతో కీలకమన్నారు. ‘మానవాళికి టెక్నాలజీ వరం. ఎకానమీకి ఎంతో ఉపయోగకరం. అదే సమయంలో టెక్నాలజీ వల్ల చాలా ముప్పులు కనిపిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలకం’ అని అన్నారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు రాబోయే ఐదేళ్లలో 5000 సైబర్ కమాండోలకు శిక్షణనిస్తామని తెలిపారు.

News September 10, 2024

ఇండియాలో iPhone16 ఫోన్ల తయారీ: అశ్వినీ

image

యాపిల్ నుంచి రిలీజైన iPhone 16 సిరీస్ ఫోన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సరికొత్త డిజైన్, ఫీచర్స్ ఐఫోన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. అయితే, ఈ ఫోన్లు ఇండియాలో తయారవుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు భారత కర్మాగారాల నుంచి ప్రపంచవ్యాప్తం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

News September 10, 2024

రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు

image

AP: వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళం ఇచ్చారు. రూ.10.60 కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, ఇప్పుడు ఒక రోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కొనియాడారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ రూ.2 కోట్లు, సీల్ సెమ్‌కార్ప్ థర్మల్ ప్రాజెక్టు రూ.50 లక్షలు, ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు.