News February 8, 2025
అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే

ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్‌పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారేకు గతంలో కేజ్రీవాల్ శిష్యుడిగా ఉన్నారు.
Similar News
News January 30, 2026
‘పుర’ సేవలు మరింత సులభం

AP: పౌరసేవలను మెరుగుపర్చేలా మున్సిపల్ శాఖ 123 మున్సిపాలిటీలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డు, వెబ్‌సైట్లను రూపొందించింది. పురమిత్ర అనే AI-ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌ను వీటికి ఇంటిగ్రేట్ చేసింది. పౌరులు మొబైల్ నంబరు నమోదుతో అవసరమైన సర్వీస్‌లు అందుకోవచ్చు. అసెస్‌మెంట్ నంబర్ లింకుతో ఫిర్యాదులు, ఆస్తి ఇతర వివరాలు పొందవచ్చు. నీటి సరఫరా, శానిటేషన్‌పై అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు.
News January 30, 2026
7,948 పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు వచ్చేశాయ్..

నిరుద్యోగ అభ్యర్థులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 <
News January 30, 2026
యువరాజ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటో చూశారా?

సినీ గ్లామర్‌ను వదిలేసి అచ్చమైన భారతీయ ఇల్లాలుగా మారిపోయిన హేజల్ కీచ్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి స్టార్ మోడల్, యువరాజ్ సింగ్ భార్య ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. మోడలింగ్, మేకప్ పక్కన పెట్టి.. పిల్లల సంరక్షణలో ఆమె మునిగిపోయారు. గ్లామర్ కంటే కుటుంబంతో ఉండే సింప్లిసిటీలోనే అసలైన అందం, ఆనందం ఉందని హేజల్ నిరూపిస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.


