News January 31, 2025

మోదీ కంటే కేజ్రీవాలే కన్నింగ్: రాహుల్ గాంధీ

image

PM మోదీ తరహాలోనే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అబద్ధాలు చెబుతుంటారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వారిద్దరి మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. ఇంకా చెప్పాలంటే మోదీ కంటే కేజ్రీవాల్ ఎక్కువ కన్నింగ్ అని దుయ్యబట్టారు. ఐదేళ్లలో యమునా నది నీళ్లను తాగేందుకు అనుకూలంగా మారుస్తానన్న హామీ నీటి మూటగా మారిందని ఫైరయ్యారు. తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే కర్ణాటక, తెలంగాణ తరహాలో హామీలు నెరవేరుస్తామన్నారు.

Similar News

News November 23, 2025

ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

image

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.

News November 23, 2025

రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ్లోబల్ సమ్మిట్‌

image

DEC 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో TG ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు 2వేల మంది ప్రముఖులు రానున్నారు. రాష్ట్ర లక్ష్యాలు, ప్రణాళికలు వివరించేలా ప్రభుత్వం ‘TG రైజింగ్-2047’ డాక్యుమెంట్‌ను రూపొందించి ఆవిష్కరించనుంది. ఈ నెల 25 నుంచి CM రేవంత్ వివిధ శాఖలతో సమీక్షించి డాక్యుమెంట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం.

News November 23, 2025

మూర్ఛ జన్యుపరమైన సమస్య

image

ఫిట్స్ ఒక దీర్ఘకాలిక రుగ్మత. దాదాపు 70% మూర్ఛ కేసులు జన్యుపరమైన కారణాలతో సంబంధం కలిగి ఉంటాయని వారు పేర్కొంటున్నారు. 2018లో ‘Neuron’ జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 622 మంది మూర్ఛ రోగుల DNAను అధ్యయనం చేయగా వారిలో మూర్ఛ వ్యాధికి కారణమయ్యే 19 కొత్త జన్యువులను పరిశోధకులు గుర్తించారట. ఈ జన్యు మార్పులు మెదడు కణాల మధ్య సంకర్షణను దెబ్బతీస్తాయని, ఫలితంగా మూర్ఛ వస్తుందని నిపుణులు గుర్తించారు.