News March 18, 2024
ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరు

ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో విచారణకు రావాలని ఆయనకు ఈడీ నిన్న సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఆయన విచారణకు వెళ్లడం లేదని ఆప్ వెల్లడించింది. ‘కోర్టులో బెయిల్ వచ్చాక మళ్లీ నోటీసులు ఎందుకు పంపారు? ఈడీ సమన్లు చట్టవిరుద్ధం’ అని ప్రకటనలో పేర్కొంది.
Similar News
News December 6, 2025
గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.
News December 6, 2025
కేంద్ర మంత్రి రామ్మోహన్‌పై విమర్శలు.. తిప్పికొట్టిన ఎంపీలు

ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తోటి MPలు మద్దతుగా నిలిచారు. ‘రామ్మోహన్ UDAN పథకాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల కొత్త ఎయిర్‌లైన్స్‌కు అవకాశాలు వస్తాయి. ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. సంక్షోభాల్లో విమానయాన సంస్థలను జవాబుదారీగా చేశారు. ప్రయాణికులకు అండగా నిలబడ్డారు’ అని పెమ్మసాని, లావు ట్వీట్లు చేశారు.
News December 6, 2025
గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్ హబ్‌గా ఇండియా

రక్షణ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్ ముందడుగు వేస్తోంది. 2029లో ₹3Tల మేర ఉత్పత్తి చేయడంతో పాటు ₹50,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇండియన్ ARMY, NAVY, AIRFORCEకు సంబంధించిన ₹670 Bల ప్రపోజల్‌ను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. FY27లో రక్షణరంగ బడ్జెట్ 20% మేర పెరగవచ్చని ఇప్పటికే రక్షణ శాఖ సంకేతాలు పంపింది. దీంతో రక్షణ ఉత్పత్తులు ఊపందుకోనున్నాయి.


