News May 25, 2024
పాక్ మంత్రికి కేజ్రీవాల్ చురకలు

పాక్ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్‌కి CM కేజ్రీవాల్ చురకలంటించారు. కేజ్రీవాల్ <<13312956>>ట్వీట్‌పై<<>> ఫవాద్ స్పందిస్తూ ‘శాంతి, సామరస్యం చేతిలో ద్వేషం, తీవ్రవాద శక్తులు ఓడిపోతాయి’ అని కామెంట్ చేశారు. ఆ కామెంట్‌పై కేజ్రీవాల్ ప్రతిస్పందించారు. ‘చౌదరీ సాబ్.. మా సమస్యలు పరిష్కరించుకోవడంలో నేను, నా దేశ ప్రజలు సమర్థులం. మీ ట్వీట్లు అవసరం లేదు. PAK పరిస్థితి బాగాలేదు. మీ దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని బదులిచ్చారు.
Similar News
News February 14, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావుకు బెయిల్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలుత అరెస్టైన ప్రణీత్ రావుకు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసీఆర్ హయాంలో ఇతడు SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) డీఎస్పీగా పని చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని, ఆధారాలను ధ్వంసం చేశారని పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు.
News February 14, 2025
రూ.90 కోట్లు దాటిన ‘తండేల్’ కలెక్షన్లు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రానికి 7 రోజుల్లోనే రూ.90.12 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. లవర్స్ డే కావడంతో ఈరోజు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీకెండ్ కావడంతో మరో రెండ్రోజులూ థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతాయని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News February 14, 2025
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: CM చంద్రబాబు

AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>>ని CM చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువతికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన సైకోను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరో చెల్లిపై దాడి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.