News May 10, 2024
కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే: BJP నేత సిర్సా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై BJP నేత మంజిందర్ సింగ్ సిర్సా స్పందించారు. బెయిల్ గడువు ముగియగానే జూన్ 2న కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. కరడుగట్టిన నేరస్థులకు ఇచ్చినట్లే కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన నేరస్థుడని కోర్టు నమ్మింది కాబట్టే.. కేవలం ఎన్నికల వరకే బెయిల్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
Similar News
News February 17, 2025
రూ.15 కోట్లు పెట్టి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కొన్నాడు!

ఖరీదైన కారుకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండాలని చాలా మందికి ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు కొందరు వెనకాడరు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా HK$14.2 మిలియన్లు (రూ.15.83 కోట్లు) పెట్టి అరుదైన సింగిల్-లెటర్ రిజిస్ట్రేషన్ మార్క్ ‘S’ను కొనుగోలు చేశారు. ఇది హాంకాంగ్ దేశంలో రవాణా శాఖ నిర్వహించిన వేలంలో జరిగింది. అలాగే ‘88’ అనే నంబర్ ప్లేట్‌ను HK$11 మిలియన్లకు (రూ.12 కోట్లు) మరో వ్యక్తి దక్కించుకున్నారు.
News February 17, 2025
కేజీహెచ్‌లో GBS మరణం? కొట్టిపారేసిన సూపరింటెండ్

AP: విశాఖపట్నం కేజీహెచ్‌లో GBSతో ఓ మహిళ మృతి చెందిందన్న ప్రచారాన్ని ఆసుపత్రి సూపరింటెండ్ శివానందం కొట్టిపారేశారు. ఇప్పటివరకు ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయని, ఎవరూ మరణించలేదని చెప్పారు. ఇది అంటువ్యాధి కాదని వెల్లడించారు. కాగా ఛాతిలో నొప్పితో ఎల్.కోట మండలం మల్లివీడుకు చెందిన రేణుకా మహంతి ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలొచ్చాయి.
News February 17, 2025
ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ: సీఎం

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు.