News February 8, 2025

ఆధిక్యంలోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా

image

న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్(254+), జంగ్‌పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా(1800+) తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మొదలైన దాదాపు రెండు గంటల తర్వాత ఆప్ అగ్రనేతలు లీడింగ్‌లోకి వచ్చారు. మరోవైపు కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీ, షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ వెనుకంజలో కొనసాగుతున్నారు.

Similar News

News February 8, 2025

అదానీ మంచి మనసు.. రూ.10,000 కోట్ల డొనేషన్

image

కుమారుడు జీత్ అదానీ-దీవా షాల పెళ్లి సందర్భంగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మంచి మనసు చాటుకున్నారు. సేవా కార్యక్రమాలకు రూ.10,000 కోట్లు వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారని వెల్లడించాయి. ‘సేవ చేయడమే భక్తి, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ’ అనేది అదానీ ఫిలాసఫీ అని పేర్కొన్నాయి.

News February 8, 2025

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

image

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు.

News February 8, 2025

మనీశ్ సిసోడియా ఓటమి

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.

error: Content is protected !!