News February 8, 2025
ఆధిక్యంలోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా

న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్(254+), జంగ్‌పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా(1800+) తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మొదలైన దాదాపు రెండు గంటల తర్వాత ఆప్ అగ్రనేతలు లీడింగ్‌లోకి వచ్చారు. మరోవైపు కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీ, షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
Similar News
News March 15, 2025
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

TG: గోషామహల్ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తే MIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దేశాన్ని వదిలిపోయేలా చేస్తానని హెచ్చరించారు. ‘లేదంటే BJPలో చేరతానని మా నేతల కాళ్లు పట్టుకునేలా చేస్తాను. హోలీ జరగనివ్వకూడదని, నగరంలో హింస సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఆయనకు మెంటల్ హాస్పిటల్లో చికిత్స ఇప్పించాలి’ అని సూచించారు.
News March 15, 2025
వాళ్లకు కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్ హెచ్చరిక

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CM రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతపెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఫాంహౌస్‌లలో డ్రగ్స్ పార్టీలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామని వెల్లడించారు. కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు.
News March 15, 2025
క్రోమ్ యూజర్లకు అర్జెంట్ వార్నింగ్!

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో రెండు వల్నరబిలిటీస్‌ను గమనించామని CERT-In తెలిపింది. లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ అవ్వకపోతే రిమోట్ ఏరియాస్ నుంచి సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసేందుకు అవకాశముందని తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. ఒక ఆర్బిట్రారీ కోడ్‌ను పంపించి మోసగించొచ్చని, వ్యక్తిగత సమాచారం దొంగిలించొచ్చని వెల్లడించింది.