News May 27, 2024

కేజ్రీవాల్ జైలుకు, రాహుల్ విదేశాలకు వెళ్తారు: అమిత్ షా

image

పంజాబ్‌ను కేజ్రీవాల్ అవినీతికి ATMగా మార్చారని అమిత్ షా ఆరోపించారు. కేజ్రీవాల్‌కు పంజాబ్ CM భగవంత్ మాన్ పైలట్‌గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్ నుంచే తీసుకెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్, AAP పంజాబ్‌ను డ్రగ్స్‌ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్ 4న మోదీ ప్రభుత్వం వస్తుందని, జూన్ 1న కేజ్రీవాల్ జైలుకు, 6న రాహుల్ విదేశాలకు వెళ్తారని లూథియానా ర్యాలీలో వ్యాఖ్యానించారు.

Similar News

News November 8, 2025

పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?

image

హీరో షారుఖ్ ఖాన్‌పై IND మాజీ ప్లేయర్ పుజారా భార్య పూజ ప్రశంసలు కురిపించారు. ఆమె రాసిన పుస్తకంలో షారుఖ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని వివరించారు. ‘2008లో పుజారా మోకాలికి గాయమైంది. అప్పుడు SAలో చికిత్స చేయించేందుకు KKR యాజమాన్యం ముందుకొచ్చింది. అతనికి సాయంగా వెళ్లేందుకు పుజారా తండ్రికి పాస్‌పోర్ట్, ప్రయాణానికి షారుఖ్ సాయం చేశారు. KKR తరఫున పుజారా ఆడకపోయినా సాయం చేయడం గొప్ప విషయం’ అని గుర్తు చేశారు.

News November 8, 2025

APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

image

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్‌ <>10 <<>>పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి బీఫార్మసీ, డీఫార్మసీ, BSc, MSc, ఇంటర్, డిప్లొమా, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27- 45ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు రెజ్యూమ్, డాక్యుమెంట్స్ recruitment@mpmmcc.tmc.gov.inకు సెండ్ చేయాలి. ఈనెల 10,11,12వ తేదీల్లో ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

News November 8, 2025

రబీ శనగ సాగుకు అనువైన రకాలు

image

రబీలో నవంబర్ 15 లోపు వరకు శనగ పంటను విత్తుకోవచ్చు.
☛ రబీకి అనువైన దేశీ శనగ రకాలు నంద్యాల శనగ-1, జెబి-11, జెఎకెఐ-9218, జెబి-130, ధీర, నంద్యాల గ్రామ్-49, నంద్యాల గ్రామ్- 452, నంద్యాలగ్రామ్-776(N.B.E.G)-776.
☛ కాబులి రకాలు: కెఎకె-2, పూలెజి-95311, లాం శనగ-7 (ఎల్‌బిఇజి-7), నంద్యాల గ్రామ్-119(N.B.E.G-119), నంద్యాల గ్రామ్-810 (N.B.E.G-810)