News May 27, 2024
కేజ్రీవాల్ జైలుకు, రాహుల్ విదేశాలకు వెళ్తారు: అమిత్ షా

పంజాబ్‌ను కేజ్రీవాల్ అవినీతికి ATMగా మార్చారని అమిత్ షా ఆరోపించారు. కేజ్రీవాల్‌కు పంజాబ్ CM భగవంత్ మాన్ పైలట్‌గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్ నుంచే తీసుకెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్, AAP పంజాబ్‌ను డ్రగ్స్ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్ 4న మోదీ ప్రభుత్వం వస్తుందని, జూన్ 1న కేజ్రీవాల్ జైలుకు, 6న రాహుల్ విదేశాలకు వెళ్తారని లూథియానా ర్యాలీలో వ్యాఖ్యానించారు.
Similar News
News February 14, 2025
వివాదాస్పద కామెంట్స్.. సుప్రీంకు యూట్యూబర్

పేరెంట్స్ సెక్స్‌పై కామెంట్స్ <<15413969>>వివాదంలో<<>> తనపై నమోదైన FIRలను క్వాష్ చేయాలంటూ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. త్వరగా విచారించడం కుదరని, ప్రొసీజర్ ప్రకారమే చేపడతామని చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం రణ్‌వీర్ పిటిషన్ విచారణకు రావడానికి రెండు, మూడు రోజులు పట్టనుంది.
News February 14, 2025
పెన్షన్లు తెచ్చిన సీఎం ఈయనే

దామోదరం సంజీవయ్య 1960-62 వరకు CMగా ఉన్నారు. ఈయనది కర్నూలు జిల్లా పెద్దపాడు. అవినీతి అధికారులను పట్టుకునే ఏసీబీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గవర్నమెంట్ టీచర్లకు, వృద్ధులకు పెన్షన్ తీసుకొచ్చారు. కాపు కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు.
*ఇవాళ ఆయన జయంతి
News February 14, 2025
యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

AP: అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.