News October 3, 2024

CM నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్

image

AAP కన్వీనర్, ఢిల్లీ మాజీ CM కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని రేపు ఖాళీ చేస్తారని పార్టీ వెల్లడించింది. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఉన్న ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నట్లు తెలిపింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 27, 2025

ఖమ్మం జిల్లాలో జాడలేని ఇన్‌ఛార్జ్ మంత్రి..?

image

ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరి ఇప్పటి వరకు జిల్లా వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ శాఖలకే పరిమితం కావడంతో, అన్ని శాఖల సమన్వయంతో జరగాల్సిన సమీక్షలు నిలిచిపోయాయి. జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్‌లో పడ్డాయి. అధికారుల్లో జవాబుదారీతనం లోపించిందని, ఇన్-ఛార్జ్ మంత్రి ఉన్నారన్న ఊసే లేదని ప్రజలు, విశ్లేషకులు మండిపడుతున్నారు.

News December 27, 2025

భారీ జీతంతో AVNLలో ఉద్యోగాలు

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌ (<>AVNL<<>>) 6 కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీటెక్, బీఈ, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. కన్సల్టెంట్‌కు బేసిక్ పే రూ.1,20,000, Sr. మేనేజర్‌కు రూ.70,000, Jr. మేనేజర్‌కు రూ.30వేలు చెల్లిస్తారు.వెబ్‌సైట్: www.avnl.co.in

News December 27, 2025

REWIND: సునామీని ముందే ఊహించిన చిన్నారి

image

2004 నాటి <<18673724>>సునామీ<<>>కి నిన్నటితో 21 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఆ సమయంలో పదేళ్ల టిల్లీ స్మిత్ సునామీని ముందే గ్రహించింది. డిసెంబర్ 26న థాయిలాండ్‌ వెళ్లిన టిల్లీ.. సముద్రం వెనక్కి వెళ్లడం, నీటిలో బుడగలు రావడాన్ని గమనించింది. వెంటనే తల్లిదండ్రులను హెచ్చరించడంతో వందల మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇదంతా తాను జియోగ్రఫీ క్లాస్‌లో నేర్చుకున్నట్లు తెలిపింది. ఆ చిన్నారిని నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.