News October 3, 2024

CM నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్

image

AAP కన్వీనర్, ఢిల్లీ మాజీ CM కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని రేపు ఖాళీ చేస్తారని పార్టీ వెల్లడించింది. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఉన్న ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నట్లు తెలిపింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 6, 2025

BRSపై ఏడుపు తప్ప CM చేసిందేముంది: హరీశ్

image

TG: CM అబద్ధాల ప్రచారంతో వాస్తవాలు మరుగున పడిపోవని, KCR చేసిన సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోరని హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లుగా BRSపై ఏడ్వడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘అనాలోచిత నిర్ణయాలతో SLBCలో 8మంది ప్రాణాలు బలిగొన్నారు. కృష్ణా నీళ్లను AP అక్రమంగా తరలించుకుపోతున్నా, DPRలు రూపొందిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫుట్‌బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.

News December 6, 2025

బిగ్‌బాస్-9: రీతూచౌదరి ఎలిమినేట్?

image

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా మారింది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నామినేషన్లలో ఆరుగురు ఉండగా నలుగురు సేవ్ అయ్యారు. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే అంతా సుమనే ఎలిమినేట్ అవుతారని భావించగా తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది.

News December 6, 2025

మూతపడిన రామగుండం థర్మల్ స్టేషన్

image

TG: రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ మూతపడింది. 1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్‌ 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్‌ జీవితకాలం ముగిసిందని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఈ యూనిట్ నుంచే విద్యుత్ సరఫరా చేశారు.