News March 22, 2024
రాజకీయ ప్రతీకారంతోనే కేజ్రీవాల్ అరెస్ట్: కేటీఆర్
TG: రాజకీయ ప్రతీకారంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు. ‘ఈడీ, సీబీఐతో బీజేపీ ప్రతిపక్షాలను అణచివేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేయిస్తోంది. రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక లక్ష్యం’ అని ఆయన మండిపడ్డారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 8, 2024
నిలబడి నీళ్లు ఎందుకు తాగకూడదంటే?
నీరు మనిషి శరీరానికి గొప్ప ఇంధనం. ప్రతి ఒక్కరూ రోజుకు 4లీటర్లు తాగడం చాలా అవసరం. అయితే నీళ్లు ఎలా తాగుతున్నామనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలతోపాటు జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. అదే కూర్చొని తాగితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్డ్స్‌గా ఉండి బాడీకి అవసరమైన ఖనిజాలూ అందుతాయి.
News September 8, 2024
YCP శ్రేణుల ఫైర్.. ట్వీట్ డిలీట్ చేసిన బ్రహ్మాజీ
మాజీ CM జగన్‌పై సెటైరికల్ ట్వీట్ చేసిన <<14048027>>బ్రహ్మాజీపై<<>> YCP శ్రేణులు సోషల్ మీడియాలో ఫైరయ్యాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా జగన్నే విమర్శించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డాయి. వరద సహాయక చర్యల్లో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీకెందుకు కోపం వచ్చిందని నిలదీశాయి. రూ.కోటితోపాటు YCP ప్రజాప్రతినిధులు నెల జీతాన్ని కేటాయించడం కనిపించలేదా? అని దుయ్యబట్టాయి. దీంతో ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.
News September 8, 2024
ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా NRC నంబర్‌ను సమర్పించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.