News May 10, 2024
కేజ్రీవాల్ భవితవ్యం ఈయన చేతుల్లోనే!

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ భవితవ్యాన్ని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి సంజీవ్ ఖన్నా తేల్చనున్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది సంజీవ్ నేతృత్వంలోని బెంచ్ నిర్ణయించనుంది. ED అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇదే బెంచ్ విచారించనుంది. దీంతో సంజీవ్ చేతుల్లోనే AAP, కేజ్రీవాల్ భవిష్యత్తు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా సంజీవ్ తదుపరి CJI అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
Similar News
News February 8, 2025
శ్రీకాకుళంలోని ఆ 104 గ్రామాల్లో ‘తండేల్’ కథలే!

AP: శ్రీకాకుళం (D) K.మత్య్సలేశంకు చెందిన రామారావు, కొందరు జాలర్ల వాస్తవిక జీవితం ఆధారంగా తీసిన మూవీ ‘తండేల్’. అయితే జిల్లాలోని 193KM తీర ప్రాంతంలో ఉన్న 104మత్స్యకార గ్రామాల్లో ఇలాంటి కథలే కన్పిస్తాయి. ఫిషింగ్ హార్బర్లు లేక కొందరు నాటు పడవలపై ప్రమాదకరంగా చేపల వేట చేస్తున్నారు. వేలాదిగా ముంబై, వీరావల్(గుజరాత్) పోర్టులకు వలస వెళ్లి వ్యాపారుల వద్ద పనుల్లో చేరి దాదాపు సముద్రానికే అంకితమవుతున్నారు.
News February 8, 2025
27 ఏళ్ల తర్వాత BJP జెండా ఎగరేస్తుందా?

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. దేశ రాజధానిపై తన జెండా ఎగిరేయడానికి దాదాపు 3 దశాబ్దాలుగా BJP ఎదురు చూస్తోంది. AK చేసిన యమునాలో విషం, రామాయణం వ్యాఖ్యలను ఆ పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. ఆప్‌ది అవినీతి ప్రభుత్వమనే విమర్శలతోనూ ఇరకాటంలో పెట్టి పోటాపోటీగా తలపడింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీనిపై మీ కామెంట్.
News February 8, 2025
9 గంటల విచారణలో ఆర్జీవీకి 41 ప్రశ్నలు

AP: ఒంగోలు రూరల్ PSలో డైరెక్టర్ RGVని నిన్న 9 గంటల పాటు 41 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాటిలో 90% ఆయన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు చెప్పారు. అలాగే, మరో కేసులో ఆయనకు గుంటూరు CID నోటీసులిచ్చి ఈ నెల 10న విచారణకు రావాలంది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని బి.వంశీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.