News March 22, 2024
భర్త అరెస్టుపై స్పందించిన కేజ్రీవాల్ భార్య
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత తొలిసారి స్పందించారు. ‘కేజ్రీవాల్ ఎప్పుడూ ఢిల్లీ ప్రజల తరఫున నిలబడ్డారు. ఆయన అరెస్ట్ అక్రమం’ అని తెలిపారు. కాగా కాసేపట్లో కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై కోర్టు తీర్పు వెలువరించనుంది. కేసు నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తే సునీత లేదా విద్యాశాఖ మంత్రి అతిశీ సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Similar News
News September 12, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో వర్షాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
News September 12, 2024
చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ
కరోనా పుట్టిన చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విస్తరిస్తోంది. దీన్ని వెట్‌ల్యాండ్ వైరస్ అని పిలుస్తున్నారు. 2019లో దీన్ని తొలిసారి గుర్తించగా, ఇప్పుడు నెలలోనే 17 మందికి సోకింది. జంతువులలో రక్తాన్నీపీల్చే పురుగుల(ఓ రకమైన నల్లులు) ద్వారా మనుషుల్లో వ్యాపిస్తోంది. వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు కనిపిస్తాయని, తర్వాత మెదడు, నరాల సంబంధ వ్యాధులకు కారణమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
News September 12, 2024
చరిత్ర సృష్టించేందుకు 58 రన్స్ దూరంలో కోహ్లీ
క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 27వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్(623 ఇన్నింగ్స్) పేరిట ఆ రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్, పాంటింగ్, సంగక్కర మాత్రమే 27వేలకు పైగా రన్స్ చేశారు.