News August 28, 2024
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్

AP ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రధాని, ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా సీఎం చంద్రబాబు చర్చల అనంతరం ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే పెండింగ్ నిధులనూ త్వరలోనే ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.
Similar News
News February 12, 2026
ఇషాన్ విధ్వంసం.. వరుసగా 6, 6, 6, 6, 4

టీ20 WCలో నమీబియాతో మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. స్మిత్ వేసిన ఆరో ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. 6 ఓవర్లకు భారత్ స్కోర్ 86-1.
News February 12, 2026
KCRను జైల్లో వేయొచ్చు కానీ…: CM రేవంత్

TG: కాళేశ్వరం కేసును CBIకి అప్పగించినా ఎందుకు విచారించడం లేదో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని CM రేవంత్ డిమాండ్ చేశారు. ‘NDSA రిపోర్టు ప్రకారం మేడిగడ్డలో నీరు నింపితే కొట్టుకుపోయే ప్రమాదముంది. అలా జరిగితే మా ప్రభుత్వంపై నిందలు వేయాలని BRS చూస్తోంది. KCRను జైల్లో వేయొచ్చు కానీ ప్రొసీజర్ ప్రకారం నడుస్తాను. నాకు సొంత రాజ్యాంగం లేదు’ అని CM ఢిల్లీలో పేర్కొన్నారు.
News February 12, 2026
నేను ట్యాపింగ్ చేయడం లేదు: రేవంత్ రెడ్డి

తాను ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని TG సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. ‘ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుంది. కాల్స్ వినడం ఓ మానసిక రోగం. SIB పేరిట రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినిమా వాళ్లు, బిజినెస్‌మెన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రభుత్వం మారగానే హార్డ్‌వేర్లు మాయం చేశారు. KCR విచారణతో ఈ కేసు క్లైమాక్స్‌కు చేరిందని అనుకోవడం లేదు’ అని తెలిపారు.


