News July 30, 2024

2రోజుల సంతాప దినాలు ప్రకటించిన కేరళ

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని చలించేలా చేసింది. ఈ <<13737849>>ఘటనలో<<>> ఇప్పటి వరకు 80 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా రాష్ట్రంలో నేడు, రేపు(మంగళ, బుధవారం) సంతాప దినాలుగా పాటించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Similar News

News December 12, 2024

రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. స్పందించిన బన్నీ టీమ్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధార, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది. అనధికార సమాచారాన్ని షేర్ చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. సరైన వివరాలకు టీమ్ ఇచ్చే అప్డేట్స్‌ను అనుసరించాలని సూచించింది.

News December 12, 2024

ధరణి పోర్టల్ తాత్కాలికంగా బంద్

image

TG: డేటా బేస్‌లో మార్పుల కారణంగా ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు డేటాబేస్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఈ మధ్య కాలంలో పోర్టల్‌లో సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.

News December 12, 2024

సినిమా షూటింగ్‌లో గాయపడ్డ అక్షయ్ కుమార్‌!

image

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్-5’ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ స్టంట్ చేస్తున్న సమయంలో ఒక వస్తువు ఆయన కంటికి తగిలినట్లు తెలిపాయి. సిబ్బంది వెంటనే నేత్ర వైద్యుడిని సెట్స్‌కి పిలిపించి చికిత్స చేయించినట్లు సమాచారం. ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారని తెలుస్తోంది. దీనిపై ఆయన టీమ్ స్పందించాల్సి ఉంది.