News March 29, 2024
లండన్ మేయర్‌పై కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు

లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘లండన్‌లో ఖరీదైన వాచ్ పెట్టుకోలేం. చేతిలో ఫోన్‌తో నడవలేం. మహిళల ఆభరణాలు, బ్యాగుల్ని కూడా తస్కరిస్తున్నారు. కార్లను పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. సాదిక్ తాను సృష్టించిన దానిపట్ల గర్వంగా ఉన్నారేమో’ అని అన్నారు. ఇస్లామిక్ దేశాల నుంచి భారీగా శరణార్థుల్ని లండన్‌కు రప్పించారన్న ఆరోపణలు సాదిక్‌పై ఉన్నాయి.
Similar News
News January 6, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని <
News January 6, 2026
ఈ చేప ఖరీదు రూ.28కోట్లు!

టోక్యోలోని టొయోసు మార్కెట్లో నిర్వహించిన వేలంలో ఒక బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243kgs బరువున్న ఈ చేపను సుమారు రూ.28Crకు ($3.2M) ఓ రెస్టారెంట్ యజమాని దక్కించుకున్నారు. జపాన్‌లోని ‘Oma’ తీరంలో దొరికిన ఇలాంటి చేపలు రుచికరంగా ఉంటాయని పేరుంది. అలాగే అక్కడి సంప్రదాయం ప్రకారం న్యూఇయర్ తొలి వేలంలో అత్యధిక ధరకు చేపను కొంటే అదృష్టమని భావిస్తారు. అందుకే వ్యాపారులు ఎంత ఖర్చయినా వెనకాడరు.
News January 6, 2026
బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్‌ను కెప్టెన్ చేసింది: జేడీయూ నేత

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్‌ను KKR జట్టు నుంచి <<18748860>>తొలగించడాన్ని<<>> JDU నేత KC త్యాగి తప్పుబట్టారు. ‘క్రీడలను రాజకీయాలు ప్రభావితం చేయకూడదు. బంగ్లాలో జరుగుతున్న వాటిపై మనం ఆందోళన చేస్తున్నాం. IPL నుంచి ఆ దేశ క్రికెటర్‌ను తొలగించాం. కానీ బంగ్లా జాతీయ జట్టుకు మైనారిటీ క్రికెటర్, హిందువు(లిటన్ దాస్)ను కెప్టెన్‌గా చేసింది. వాళ్లు బలమైన సందేశం పంపారు. మనం పునరాలోచించాలి’ అని చెప్పారు.


