News March 29, 2024

లండన్ మేయర్‌పై కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు

image

లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘లండన్‌లో ఖరీదైన వాచ్ పెట్టుకోలేం. చేతిలో ఫోన్‌తో నడవలేం. మహిళల ఆభరణాలు, బ్యాగుల్ని కూడా తస్కరిస్తున్నారు. కార్లను పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. సాదిక్ తాను సృష్టించిన దానిపట్ల గర్వంగా ఉన్నారేమో’ అని అన్నారు. ఇస్లామిక్ దేశాల నుంచి భారీగా శరణార్థుల్ని లండన్‌కు రప్పించారన్న ఆరోపణలు సాదిక్‌పై ఉన్నాయి.

Similar News

News February 8, 2026

ప్రచారానికి రేపే ఆఖరు.. నేతలపై ఒత్తిళ్లు

image

TG: మున్సిపోల్ ప్రచారానికి రేపు సాయంత్రంతో తెరపడనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమతమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని ముఖ్యనేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, BRSలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ ఉండగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News February 8, 2026

ఏగిలిచేస్తే ఏలనివానికైనా పండుతుంది

image

ఏగిలి చేయడం అంటే పొలాన్ని బాగా దున్నడం, చదును లేదా దమ్ము చేయడం అని అర్థం. ఏలనివానికైనా అంటే ఏమీ తెలియని వాడని అర్థం. సాగు చేయాలనుకునే నేలను బాగా చదును చేసి, దున్ని సరైన సమయంలో విత్తనం వేస్తే, వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేని వారికైనా సరే పంట బాగా పండుతుంది. అంటే మన కష్టం మరియు నేల సత్తువ మీదే పంట దిగుబడి, ఆదాయం ఆధారపడి ఉంటుందని ఈ సామెత అంతరార్థం.

News February 8, 2026

భాను వ్రతం ఆచరిస్తే.. పాటించాల్సిన నియమాలు

image

సూర్య వ్రతం ఆచరించే వారు సూర్యోదయానికి మేల్కొని, పవిత్ర స్నానం ఆచరించి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తెలుపు/ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా గదిలో సూర్య యంత్రాన్ని, పటాన్ని ఉంచి, ఎర్రటి పూలు, గంధంతో అర్చించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు పండ్లు లేదా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి. దీనివల్ల ఆరోగ్యం, తేజస్సు సిద్ధిస్తాయి.