News February 14, 2025
విరాట్ జెర్సీలో కెవిన్ పీటర్సన్ కొడుకు!

ఇంగ్లండ్ జట్టు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కుమారుడు డిలాన్ పీటర్సన్‌కు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన వన్డే జెర్సీని బహుమతిగా ఇచ్చారు. జెర్సీపై ఆటోగ్రాఫ్‌తో పాటు ‘టు డిలాన్, విత్ బెస్ట్ విషెస్’ అని రాసి ఇచ్చారు. ‘ఇంటికొచ్చి కోహ్లీ జెర్సీని డిలాన్‌కు ఇచ్చా. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. థాంక్స్ బడ్డీ’ అని కెవిన్ తన కొడుకు ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Similar News
News November 29, 2025
రోహిత్ శర్మ ముంగిట అరుదైన రికార్డులు

SAతో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. 3 సిక్సులు బాదితే ODI ఫార్మాట్లో లీడింగ్ సిక్స్ హిట్టర్‌గా నిలుస్తారు. అలాగే 98 రన్స్ చేస్తే 20వేల అంతర్జాతీయ పరుగులు పూర్తవుతాయి. 213 రన్స్ కొడితే 16వేల పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్‌గా అవతరిస్తారు. ఓ సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డ్ సృష్టిస్తారు. SAతో 3 వన్డేల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
News November 29, 2025
ChatGPTలో ఇది ఎప్పుడైనా గమనించారా?

అడ్వాన్స్డ్ AI టూల్ అయిన ChatGPT టైమ్ చెప్పలేకపోవడం చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణంగా ChatGPTకి సిస్టమ్ టైమ్‌కు నేరుగా యాక్సెస్ ఉండకపోవడం. రియల్‌టైమ్ డేటా చేర్చడానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండటంతో పాటు AI గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే Gemini, Copilot, Grok వంటి AI టూల్స్ మాత్రం ఆటోమేటిక్‌గా టైమ్ చెప్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు OpenAI పనిచేస్తోంది.
News November 29, 2025
కాళోజీ వర్సిటీ ఇష్యూ.. చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం: రేవంత్

TG: కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలతో పాటు ఇన్ఛార్జుల నియామకంలో ఆరోపణలపై ఆయన ఆరా తీశారు. ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆరోపణలతో కాళోజీ వర్సిటీ వీసీ డా.నందకుమార్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.


