News August 28, 2024

త్వరలో హైడ్రా చట్టం: కమిషనర్ రంగనాథ్

image

TG: HYDRA పేరిట ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. అమల్లోకి వచ్చాక త్వరలోనే హైడ్రా పేరిట స్వయంగా నోటీసులు ఇస్తామన్నారు. హైడ్రా పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు తమ విచారణలో తేలిన అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Similar News

News January 6, 2026

31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 6, 2026

కిలో చికెన్ రూ.320.. మరింత పెరిగే అవకాశం!

image

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చికెన్ ధర స్కిన్‌లెస్ కిలోకి రూ.320 వరకు ఉంది. చాలాకాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటంతో చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. డిమాండుకు తగ్గట్లు సప్లయ్ లేకపోవడం వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కోడిగుడ్డు ధర కూడా రూ.8గా ఉంది.

News January 6, 2026

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు కూడా బాబా భక్తురాలే

image

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రిగ్జ్ సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషంగా మారింది. మదురో స్థానంలో ఆమెను ఆ దేశ సుప్రీంకోర్టు నియమించింది. ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో పలుమార్లు పుట్టపర్తిని సందర్శించారు. 2023, 2024కి చెందిన ఆమె పర్యటనల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. <<18761400>>మదురో<<>> కూడా సత్యసాయిని గురువుగా భావించేవారు.