News November 17, 2024

ఆధార్‌లో DOB మార్పులపై కీలక ప్రకటన

image

AP: ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీచేసే ధ్రువీకరణ పత్రాలనూ అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికెట్ల మాదిరే GOVT ఆస్పత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి సూచించింది.

Similar News

News November 17, 2024

మిస్ యూనివర్స్-2024 రేస్ నుంచి భారత్ ఔట్

image

మెక్సికోలో జరుగుతున్న మిస్ యూనివర్స్-2024 అందాల పోటీలో భారత్ ప్రస్థానం ముగిసింది. మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా స్విమ్ సూట్ రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 30 మంది పాల్గొన్న ఈ రౌండ్‌ నుంచి 12 మంది మాత్రమే తదుపరి గౌను రౌండ్‌కు ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌కు చెందిన రియా మిస్ యూనివర్స్ ఇండియా-2024 విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికయ్యారు.

News November 17, 2024

ఆవు పేడలో నోట్ల కట్టలు

image

HYDలోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా సంస్థ లాకర్ నుంచి రూ.20లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఆ డబ్బును ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బాదమందరుని గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అతని అత్తమామలపై ఇంట్లో తనిఖీలు చేశారు. చివరికి ఆవు పేడ కుప్పలో నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

News November 17, 2024

అణ్వాయుధాల తయారీ AIకి ఇవ్వొద్దు.. US, చైనా ఒప్పందం

image

AI ఊహాతీతంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అణ్వాయుధాల తయారీ, నిర్వహణ దాని చేతిలో ఎప్పుడూ పెట్టకూడదని US, చైనా తాజాగా అంగీకరించాయి. పెరూలో జరిగిన APEC సదస్సులో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయిన సందర్భంగా అణ్వాయుధాలను మనుషులు మాత్రమే హ్యాండిల్ చేయాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో AIని బాధ్యతగా వాడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం US వద్ద 5044, చైనా వద్ద 500 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి.