News November 17, 2024
ఆధార్‌లో DOB మార్పులపై కీలక ప్రకటన
AP: ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీచేసే ధ్రువీకరణ పత్రాలనూ అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికెట్ల మాదిరే GOVT ఆస్పత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి సూచించింది.
Similar News
News December 7, 2024
పుష్కలంగా టీబీ మందులు: కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో క్షయ వ్యాధి(TB) నిరోధక ఔషధాల కొరత ఏర్పడిందన్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. DEC6 నాటికి అన్ని కేంద్రాల్లో 2 నెలలకు పైగా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపింది. మందులను సకాలంలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామంది. కాగా TB కేసుల్లో దేశం టాప్‌లో ఉంది. 21.69లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. TB కట్టడే లక్ష్యంగా 347 హైఫోకస్ జిల్లాల్లో 100 రోజుల ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
News December 7, 2024
ఆటోల బంద్‌పై వెనక్కి తగ్గిన JAC
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన JAC దానిని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ గిరాకీ పోయి, ఉపాధి దెబ్బతిందని JAC నేతలు తొలుత ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు ప్రభుత్వం ఏటా రూ.15వేలు చెల్లించాలని కోరుతున్నారు.
News December 7, 2024
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
AP: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం 23 సాధారణ, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. 23 సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం రావడంతో 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించనున్నాయి. ఆప్షనల్ హాలిడేస్‌లో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చాయి. మొత్తం 12 నెలల్లో మే, నవంబర్ తప్ప 10 నెలల్లో సెలవులు ఉన్నాయి.