News September 16, 2024

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కీలక మార్పులు

image

AP: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బ్రిటిష్ కాలం నాటి రాచరిక వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఆ కార్యాలయాల్లో ఉండే స్పెషల్ ఛాంబర్, రెయిలింగ్, రెడ్ కార్పెట్లు, పోడియం, ఎత్తయిన కుర్చీలను తీసేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఆదేశించారు. సిటిజన్ ఫ్రెండ్లీ ఆఫీస్‌లుగా మార్చాలని ఉత్తర్వులిచ్చారు. క్రయ, విక్రయదారుల కోసం కుర్చీలు, వారికి తాగునీరు, కాఫీ, టీ అందించాలని స్పష్టం చేశారు.

Similar News

News October 10, 2024

కొండా సురేఖకు కోర్టు నోటీసులు

image

TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కొండా సురేఖ అసత్య ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

News October 10, 2024

TEAM INDIA: మనల్ని ఎవడ్రా ఆపేది!

image

ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాకు ఎదురే లేకుండా పోయింది. అటు టెస్టుల్లో, ఇటు టీ20ల్లో వరుస విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాది 8 టెస్టులు ఆడగా ఒక్క మ్యాచ్‌లోనే ఓడి ఏడింట్లో జయకేతనం ఎగరేసింది. మరోవైపు 21 టీ20లు ఆడి ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది. కాగా ఈ ఏడాది భారత్ 3 వన్డేలే ఆడినా రెండిట్లో ఓడి ఒకటి టై చేసుకుంది. అటు టెస్టుల్లో రోహిత్ శర్మ, ఇటు టీ20ల్లో సూర్యకుమార్ సారథ్యంలో భారత్ దూసుకుపోతోంది.

News October 10, 2024

మోపిదేవి పార్టీ మారడం బాధాకరం: జగన్

image

AP: రేపల్లె నియోజకవర్గ నేత మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆయన విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం బాధాకరమని అన్నారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని అన్నారు. తనను జైల్లో పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యానని వ్యాఖ్యానించారు. దేవుడు మంచివైపు ఉంటాడని చెప్పారు.