News January 8, 2025
కాంగ్రెస్ కీలక సమావేశం నేడు
TG: గాంధీభవన్‌లో ఇవాళ PCC రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) సమావేశం జరగనుంది. AICC జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా రేవంత్, భట్టి, పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఏడాది పాలనలో ప్రజల్లో స్పందన, గ్యారంటీల అమలు తీరు, రానున్న 4 ఏళ్లలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News January 22, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న అఫ్జల్‌గంజ్ కాల్పుల దొంగలు
కర్ణాటకలోని బీదర్, HYDలోని అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు<<>> జరిపిన దుండగులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు తిరుమలగిరి నుంచి శామీర్‌పేట్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో షేర్ ఆటోలో గజ్వేల్‌కు, లారీలో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
News January 22, 2025
టీమ్ఇండియా జెర్సీపై పాక్ పేరు.. ICC వార్నింగ్!
టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్‌నేమ్ పాకిస్థాన్‌ను ముద్రించకుండా ఉండేందుకు ICC అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. BCCI రిక్వెస్ట్‌ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్‌నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
News January 22, 2025
బిల్‌గేట్స్‌తో భేటీ కానున్న చంద్రబాబు
AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.