News February 18, 2025
SI పోస్టుల నియామకాలపై కీలక నిర్ణయం

AP: పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. SI(సివిల్) పోస్టులను 65%(గతంలో 55%) డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ప్రమోషన్ ద్వారా 30%, బదిలీల ద్వారా 5% భర్తీ చేయాలంది. గత ఏడాది జులై 1 నుంచి ఏర్పడిన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర అవార్డులు పొందినవారికి కేటగిరీలను బట్టి 5-25 మార్కులు ఇచ్చి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంది.
Similar News
News March 15, 2025
నిద్రలేమితో అనారోగ్యమే!

మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
News March 15, 2025
గ్రూప్-3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?

TG: నిన్న వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్ 339.239 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించడం గమనార్హం. మొత్తం 2,67,921 మంది పరీక్షలు రాయగా 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను రిలీజ్ చేశారు. టాప్-10లో ఒక్కరు మాత్రమే అమ్మాయి ఉండటం గమనార్హం. మొత్తంగా టాప్-100లో 12 మంది అమ్మాయిలు ఉన్నారు.
News March 15, 2025
ALERT.. రెండు రోజులు జాగ్రత్త

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తుని, కావలి, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ, రేపు రాయలసీమ, కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.