News February 6, 2025
సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పరిణామం
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పురోగతి లభించింది. దాడి చేసిన నిందితుడిని సైఫ్ సిబ్బంది గుర్తించారు. పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని వారు స్పష్టంగా గుర్తించి చూపించారు. సైఫ్‌పై దాడి చేసింది అతడేనని పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 6, 2025
OTTలోకి కొత్త సినిమాలు
ఫిబ్రవరి 7 – గేమ్ ఛేంజర్ (AMAZON PRIME)
ఫిబ్రవరి 8 – దేవకీ నందన వాసుదేవ (Disney+ Hotstar)
ఫిబ్రవరి 11- కాదలిక్కా నేరమిల్లై (Netflix)
ఫిబ్రవరి 14 – మార్కో (SonyLIV)
ఫిబ్రవరి 18 – ముఫాసా-ది లయన్ కింగ్ (Disney+ Hotstar)
FEB 22 (అంచనా) – కిచ్చా సుదీప్ ‘MAX’ – ZEE5
News February 6, 2025
భారత్‌కు బిగ్ షాక్.. ఓపెనర్లు ఔట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (1*), శ్రేయస్ అయ్యర్ (12*) ఉన్నారు. కాగా భారత్ విజయానికి ఇంకా 218 పరుగులు అవసరం.
News February 6, 2025
హర్షిత్ రానా అరుదైన రికార్డు
భారత యువ పేసర్ హర్షిత్ రాణా భారీగా పరుగులిస్తున్నా వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, ODI, టీ20) డెబ్యూ మ్యాచుల్లో మూడేసి వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పారు. టెస్టులో AUSపై 3/48, టీ20లో ENGపై 3/33, ODIలో ENGపై 3/53 వికెట్లతో రాణించారు. అలాగే వన్డేల్లో డెబ్యూ మ్యాచులో ఒకే ఓవర్లో అత్యధిక రన్స్ (26) సమర్పించుకున్న భారత బౌలర్‌గా నిలిచారు.