News January 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుల్లో ఒకరైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రతో కూడిన బెంచ్ ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని స్పష్టం చేసింది.
Similar News
News January 1, 2026
‘స్పిరిట్’ లుక్‌పై ఫ్యాన్స్ ఖుషీ.. మీకెలా అనిపించింది!

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ ఫస్ట్ పోస్టర్ SMను షేక్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఫస్ట్ లుక్స్‌తో పోలిస్తే ‘స్పిరిట్’ లుక్ మరింత ఇంటెన్సివ్‌గా ఉందనే చర్చ నడుస్తోంది. ఈసారి ప్రభాస్‌ను సందీప్ సరికొత్తగా చూపించబోతున్నారని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘స్పిరిట్’ లుక్ ఎలా ఉంది? COMMENT
News January 1, 2026
తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.
News January 1, 2026
2026: బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్

TG: 2026లోకి అడుగుపెడుతున్నామని చెబుతూ ఒక్కో అంకెకు ఒక్కో వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై BRS సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2 – రెండేండ్ల సమయం వృథా, 0 – కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా, 2 – కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవి?, 6- ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఎన్నెన్నో హామీలిచ్చి, మాయమాటలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టింది.


