News November 13, 2024

ఆన్‌లైన్ డెలివరీ సంస్థలకు కీలక ఆదేశాలు

image

ఫుడ్ ఐటమ్స్ డెలివరీ విషయంలో ఈకామర్స్ సంస్థలకు FSSAI కీలక ఆదేశాలిచ్చింది. డెలివరీ సమయానికి ఫుడ్ ఐటమ్స్ నిల్వకాలం మరో 30% ఉండేలా చూసుకోవాలని చెప్పింది. లేదా ఎక్స్‌పైరీ డేట్ కనీసం మరో 45రోజులుండాలని పేర్కొంది. లేబుల్స్‌పై లేని సమాచారాన్ని ప్రకటనల్లో చూపించవద్దని పేర్కొంది. ఆహార, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చెయ్యాలని, తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని చెప్పింది.

Similar News

News December 14, 2024

KTRను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: పాడి కౌశిక్ రెడ్డి

image

TG: హీరో అల్లు అర్జున్‌ను నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నిన్ననే బెయిల్ పేపర్లు అందినా జైలు అధికారులు ఆయనను ఇవాళ రిలీజ్ చేయడం ఏంటని నిలదీశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని అంటున్నారని, ఆయనను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.

News December 14, 2024

ICUలో అద్వానీ: లేటెస్ట్ హెల్త్ అప్డేట్

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని LK అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఢిల్లీ అపోలో ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. శనివారం మాత్రం ICUలో అడ్మిట్ చేశారు. సీనియర్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరీ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 97ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

News December 14, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.980 తగ్గి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.900 తగ్గి రూ.71,400గా ఉంది. మరోవైపు సిల్వర్ ధర కూడా కేజీపై రూ.వెయ్యి తగ్గింది. దీంతో ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉంది.