News January 26, 2025
గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తూ, సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఇకపై A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, B కేటగిరీలో 7, C-కేటగిరీ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండనున్నారు. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువమంది, మరికొన్నిచోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News November 20, 2025
‘1600’ సిరీస్‌తోనే కాల్స్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

దేశంలో పెరిగిపోతున్న స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు తమ సర్వీసు, లావాదేవీల కాల్స్ కోసం 1600తో మొదలయ్యే నంబర్ సిరీస్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు జనవరి 1 నాటికి, పెద్ద NBFCలు, పేమెంట్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1 కల్లా, మిగతా NBFCలు, సహకార బ్యాంకులు, RRBలు మార్చి 1 లోపు ఈ సిరీస్‌కు మారాల్సి ఉంది.
News November 20, 2025
పోలి పాడ్యమి కథ అందిస్తున్న సందేశాలివే..

☞ భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
☞ అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
☞ సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞ కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.
News November 20, 2025
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.


