News January 26, 2025

గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తూ, సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఇకపై A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, B కేటగిరీలో 7, C-కేటగిరీ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండనున్నారు. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువమంది, మరికొన్నిచోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 16, 2025

నేటి నుంచి కులగణన రీసర్వే

image

TG: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన కులసర్వేలో పాల్గొనని వారికి నేటి నుంచి రీసర్వే చేయనున్నారు. ఈ సారి 3.56 లక్షల కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేయడం, ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో వివరాలు అందించడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. ఈ నెల 28 వరకు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు.

News February 16, 2025

మరో వలసదారుల బ్యాచ్‌ను పంపించిన US

image

116మంది అక్రమ వలసదారులతో కూడిన మరో విమానాన్ని అమెరికా తాజాగా భారత్‌కు పంపించింది. ఈ విమానం నిన్న రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. తిరిగొచ్చినవారిలో పంజాబ్(65మంది), హరియాణా(33), గుజరాత్(8మంది), యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ నుంచి తలో ఇద్దరు, హిమాచల్, కశ్మీర్ నుంచి చెరొకరు ఉన్నారు. తొలి దఫా వలసదారుల విమానం ఈ నెల 5న వచ్చిన సంగతి తెలిసిందే.

News February 16, 2025

IPL 2025: హైదరాబాద్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్?

image

హైదరాబాద్ గత ఏడాది ఐపీఎల్ రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులు ఉప్పల్‌లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది విజేతగా నిలిచిన KKR హోమ్ గ్రౌండ్ ఈడెన్‌ గార్డెన్స్‌లో క్వాలిఫయర్2, ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా SRH తొలి మ్యాచ్‌ను వచ్చే నెల 23న మధ్యాహ్నం ఆడనున్నట్లు సమాచారం. మొత్తం షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.

error: Content is protected !!