News May 10, 2024

DBTలపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మే 13న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు వంటి పథకాల అర్హులకు అందాల్సిన నగదు ఆలస్యం కానుంది.

Similar News

News November 26, 2025

మూవీ అప్డేట్స్

image

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటిస్తారని టాక్.

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

న్యూస్ అప్‌డేట్స్ @4PM

image

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ