News November 17, 2024
రేపు అసెంబ్లీలో కీలక తీర్మానాలు
AP అసెంబ్లీలో రేపు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో 8 డివిజనల్, 4 రైల్వే జోనల్ కమిటీలు, యూజర్ కన్సల్టింగ్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను రెండేళ్ల కాలానికి సభ్యులుగా ఎన్నుకునేలా తీర్మానం ప్రవేశపెడతారు.
రేపు అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీటిని ప్రవేశపెట్టనున్నారు. అలాగే బడ్జెట్ సహా పలు అంశాలపై రేపు చర్చలు జరగనున్నాయి.
Similar News
News December 6, 2024
పుష్ప-2 ALL TIME RECORD
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా కలెక్షన్లు కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ పొందిన ఈ సినిమా తొలిరోజు నైజాంలో ఆల్ టైం రికార్డు సాధించింది. తాజా PR లెక్కల ప్రకారం ఏకంగా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పుష్ప రాజ్ మాస్ జాతర ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.
News December 6, 2024
మళ్లీ ఆదుకున్న నితీశ్ రెడ్డి
పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. భారత్‌కు సరైన ఆల్‌రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News December 6, 2024
రోదసిలో నడవనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్‌లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.