News January 25, 2025
మీర్‌పేట్ ఘటనలో కీలక UPDATE

HYD మీర్‌పేట్ <<15256609>>హత్య కేసులో<<>> పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటివరకు మిస్సింగ్‌గా ఉన్న కేసును హత్య కేసుగా మార్చారు. మాధవి భర్త గురుమూర్తిని నిందితుడిగా తేల్చారు. ఆమెను భర్త హత్య చేసినట్లు పలు ఆధారాలను సేకరించారు. వాటర్ హీటర్, బకెట్‌పై అవశేషాలను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. మాధవిని చంపి బకెట్‌లో పెట్టి వాటర్ హీటర్‌తో ఉడికించినట్లు తేల్చారు. అవశేషాలను మాధవి DNAతో ఫోరెన్సిక్ బృందం సరిపోల్చనుంది.
Similar News
News February 15, 2025
ప్రేమలో పడ్డారా? ఇలా తెలుసుకోండి!

మొబైల్‌లో చాట్ చేస్తూ నవ్వుకుంటున్నామంటే చాలు వీడు ప్రేమలో ఉన్నాడు అని మన పెద్దవాళ్లు డిసైడ్ చేసేస్తుంటారు. మీరు మీమ్స్ చూసి నవ్వుకుంటున్నారన్న విషయం వారికి తెలియదు. కానీ, ప్రేమలో పడినవారి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని BBC ఓ కథనంలో పేర్కొంది. బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటే, చేతులు జిగురులా అతుక్కుంటే.. అవి ప్రేమలో పడ్డారనడానికి సంకేతం అని పేర్కొంది.
News February 14, 2025
స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.
News February 14, 2025
ఏ జిల్లాకు ఏ ర్యాంక్ వచ్చింది?

AP: ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, కోనసీమ, మన్యం, శ్రీ సత్యసాయి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, విజయనగరం, చిత్తూరు, అల్లూరి జిల్లాలు ఉన్నాయి.