News December 6, 2024
8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్

8వ వేతన సంఘం ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 7వ వేతన సంఘం కాలపరిమితి త్వరలో ముగుస్తున్నందున కొత్త ఏడాదిలో కొత్త పే కమిషన్‌పై కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే కొత్త కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం తమ వద్ద లేదని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరీ ఇటీవల రాజ్యసభలో తెలిపారు.
Similar News
News January 22, 2026
IIFCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 22, 2026
అనిల్ రావిపూడి కొత్త సినిమాలో ఇద్దరు హీరోలు?

వరుస హిట్ సినిమాలతో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి మూవీ రిలీజయ్యే అవకాశముందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకీ, రానా గతంలో ‘రానా నాయుడు’ సిరీస్‌లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
News January 22, 2026
హత్యారాజకీయాలతో విషబీజాలు నాటుతున్న CBN: జగన్

AP: హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ CBN నాటుతున్న విషబీజాలు చెట్లుగా మారి కంట్రోల్ కాని పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు. ‘ఇళ్లు, ఆస్తులు వదిలి ఊళ్లు వదిలి వెళ్లిపోయేలా YCP వారిపై కూటమి నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారు. మా కార్యకర్తలను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాలు రేపు చూస్తూ ఊరుకుంటాయా? పోలీసులు, MLAలు, CBN బాధ్యత వహించకతప్పదు’ అని పేర్కొన్నారు. పాలకులన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.


