News June 30, 2024
రానా సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్?

‘KGF’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో మరో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కిశోర్ అనే కొత్త దర్శకుడితో రానా హీరోగా చేయబోయే సినిమాలో ఆమె నటించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీనిధి తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ అనే మూవీ చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ ‘వేట్టయాన్’లో రానా కీలకపాత్ర పోషిస్తున్నారు. తేజ దర్శకత్వంలోనూ ‘రాక్షస రాజ్యం’ అనే మూవీ చేయనున్నారు.
Similar News
News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
News July 8, 2025
ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.
News July 8, 2025
ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.