News September 13, 2024
కెనడాలో ఖలిస్థానీల బాంబు దాడి: పంజాబ్‌లో NIA సోదాలు
కెనడాలోని భారత హైకమిషన్‌పై ఖలిస్థానీ సపోర్టర్ల బాంబు దాడి కేసులో NIA పంజాబ్‌లో సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే అధికారులు కొందరి ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారని తెలిసింది. 2023, మార్చి 23న ఒట్టావాలో హై కమిషన్ ముందు దేశవ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థానీలు త్రివర్ణ పతాకాలు తొలగించి తమ జెండాలు పాతారు. భవంతిలోకి 2 గ్రెనేడ్లు విసిరారు. దీనిపై నిరుడు జూన్‌లో NIA కేసు నమోదు చేసింది.
Similar News
News October 5, 2024
బతుకమ్మ అంటే ఈ ముఖ్యమంత్రికి గిట్టదా?: KTR
TG: బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బుల్లేని పరిస్థితులు దాపురించాయని KTR అన్నారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా? బతుకమ్మ చీరలను రద్దు చేశారు. ఇప్పుడు ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని X వేదికగా ప్రశ్నించారు.
News October 5, 2024
రేపు ఢిల్లీకి రేవంత్.. సీఎంల భేటీకి హాజరు
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వగా, మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలనూ సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 5, 2024
టీ20 WC: భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 WCలో నిన్న కివీస్ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా -2.900 NRRతో గ్రూప్-Aలో చివరి స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే మిగతా 3 మ్యాచులు (PAK, SL, AUS) గెలవడంతో పాటు బెటర్ రన్ రేట్ సాధించాలి. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. బలమైన AUS టీమ్ ఎలాగో SFకి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్ SF చేరాలంటే AUS మినహా మిగతా 3 జట్లు రెండేసి మ్యాచులు ఓడాలి. వాటి NRR మనకంటే తక్కువుండాలి.