News October 21, 2024
ఎయిరిండియా ప్రయాణికులకు ఖలిస్థానీ ఉగ్రవాది వార్నింగ్
భారత విమానాలకు వరుస బెదిరింపుల నడుమ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. గత ఏడాది కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా అతడిని 2020లో కేంద్రం టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
Similar News
News November 12, 2024
డిసెంబర్ 1 నుంచి బీజేపీ పాదయాత్ర
TG: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే నెల 1 నుంచి బీజేపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసన తెలుపుతూ పాదయాత్రను చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ సవాలును స్వీకరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 15 లేదా 16న మూసీ పరీవాహక ప్రాంతాల్లో బస చేయనున్నారు.
News November 12, 2024
అసెంబ్లీ చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు
AP: శాసన సభ, మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. అసెంబ్లీలో 15 మందిని విప్‌లుగా నియమించింది. అసెంబ్లీ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ ఉండనున్నారు.
News November 12, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్
ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి సీజన్ కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించింది. IPL-2025 సీజన్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ బౌలింగ్ కోచ్‌గా ఉండనున్నారు. ఈయన భారత్ తరఫున 70 వన్డేలు ఆడి 86 వికెట్లు తీశారు. రికీ పాంటింగ్ ఆ ఫ్రాంచైజీని వీడిన తర్వాత భారత మాజీ క్రికెటర్లు హేమాంగ్ బదానీని హెడ్ కోచ్‌గా, వేణుగోపాలరావును డైరెక్టర్‌గా డీసీ మేనేజ్మెంట్ నియమించింది.