News May 25, 2024

ఖరీఫ్ పంట ఉత్పత్తి లక్ష్యం 167 లక్షల టన్నులు

image

AP: ఈ ఏడాది ఖరీఫ్‌లో 81.65 లక్షల ఎకరాల్లో 24 రకాల పంటల సాగు లక్ష్యంతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 167.15 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అంచనా వేసింది. ఇప్పటికే 5.49 లక్షల క్వింటాళ్ల వరి, చిరుధాన్యాలు, అపరాలు, నువ్వులు, వేరుశనగ విత్తనాలను రాయితీతో ఆర్బీకేల ద్వారా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే 17.50 లక్షల టన్నుల ఎరువులను రెడీగా ఉంచింది.

Similar News

News December 5, 2025

ప్రెగ్నెన్సీలో ఇది ప్రాణాంతకం

image

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకూ పునర్జన్మలాంటిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కాంప్లికేషన్లు వచ్చి ప్రాణాలు కోల్పోతారు. వాటిల్లో ఒకటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. దీనివల్ల గర్భంలోని ఉమ్మనీరు తల్లి రక్తంలో కలిసిపోతాయి. దీంతో శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో ఊపిరి ఆడకపోవడం, బీపీ పెరగడం, గుండెకు రక్తసరఫరా ఆగిపోవడం, అధిక రక్తస్రావం జరిగి కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

News December 5, 2025

హనుమాన్ చాలీసా భావం -29

image

చారో యుగ ప్రతాప తుమ్హారా|
హై పరసిద్ధ జగత ఉజియారా||
ఓ హనుమా! మీ శక్తి, కీర్తి 4 యుగాలలో ప్రసిద్ధి చెందింది. ఈ సత్యం లోకమంతా విధితమే. మీ ఉనికి ఈ జగత్తు మొత్తానికి కాంతిలా వెలుగునిస్తుంది. మీరు ఈ ప్రపంచంలోని చీకటిని పోగొట్టి, జ్ఞానం, ధైర్యం, ఆనందాన్ని ఇస్తూ, సర్వత్రా వెలుగు పంచుతున్నారు. యుగాలు మారినా, మీ మహిమ మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరక, ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూనే ఉంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 5, 2025

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(CSIR-CEERI) ప్రాజెక్ట్ స్టాఫ్ , JRF పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఇనుస్ట్రుమెంటేషన్/ఫిజిక్స్‌లో B.Tech/BE/M.Tech/ME/MSc, BSc లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ceeri.res.in/