News May 25, 2024
ఖరీఫ్ పంట ఉత్పత్తి లక్ష్యం 167 లక్షల టన్నులు

AP: ఈ ఏడాది ఖరీఫ్‌లో 81.65 లక్షల ఎకరాల్లో 24 రకాల పంటల సాగు లక్ష్యంతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 167.15 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అంచనా వేసింది. ఇప్పటికే 5.49 లక్షల క్వింటాళ్ల వరి, చిరుధాన్యాలు, అపరాలు, నువ్వులు, వేరుశనగ విత్తనాలను రాయితీతో ఆర్బీకేల ద్వారా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే 17.50 లక్షల టన్నుల ఎరువులను రెడీగా ఉంచింది.
Similar News
News March 17, 2026
సినిమా పైరసీ చేస్తే మూడేళ్ల జైలు!

TG: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపడుతోంది. మూవీ పైరసీ చేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ తప్పదని CSB డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి సంయుక్తంగా యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 17, 2026
పెరగనున్న కార్ల ధరలు!

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.
News March 17, 2026
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. స్పందించిన డైరెక్టర్

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ <<19398040>>పేరును<<>> ‘మాతృభూమి’గా మార్చడం తెలిసిందే. దీనిపై మూవీ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్పందించారు. ‘ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ముందుగానే 2 టైటిల్స్ నమోదు చేసుకున్నాం. మానవత్వం, సానుభూతి, మన సైనికుల నిశ్శబ్ద పోరాటాల గురించి మూవీ తెలియజేస్తుంది. కొత్త టైటిల్ చిత్రంలోని భావోద్వేగాన్ని మరింత ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.


