News October 1, 2024

ఏపీలో ఖరీఫ్ సాగు 84 శాతమే

image

AP: ఖరీఫ్ సీజన్‌లో సాగు లక్ష్యం 32.50లక్షల హెక్టార్లు కాగా, 27.44లక్షల హెక్టార్లలోనే(84 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాగు 10%, పత్తి 33%, వేరుశనగ 48% తగ్గింది. పలు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో వర్షాభావం, సకాలంలో వరుణుడు కరుణించకపోవడం వల్ల సాగు లక్ష్యం నెరవేరలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జొన్న, కొర్ర, సజ్జ, కంది, మినుము, పెసర, సన్‌ఫ్లవర్ వంటి పంటల సాగు ఆశాజనకంగా ఉందన్నారు.

Similar News

News October 1, 2024

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖలో కేంద్రాలు సిద్ధం చేసి నిపుణులతో తరగతులు చెప్పించనుంది. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపినవారిని ట్రైనింగ్‌కు ఎంపిక చేయనుంది. ఇందుకోసం నారాయణ కాలేజీల సహకారం తీసుకోనున్నట్లు సమాచారం.

News October 1, 2024

తిరుమల లడ్డూ వివాదం.. కేంద్రం ఏం చేయబోతోంది?

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలపై నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ విచారణను కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అనే దానిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి నివేదిక సైతం దానికి అనుకూలంగానే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

News October 1, 2024

CM ఇంటిముందు ధర్నా చేస్తా: మైనంపల్లి

image

TG: కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు హాట్ కామెంట్స్ చేశారు. RRR ప్రాజెక్టు నుంచి BRS MLA హరీశ్ భూములను తప్పించారని ఆరోపించారు. రెండు రోజుల్లో తాను హరీశ్‌రావు భూములను సందర్శిస్తానన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.