News October 1, 2024
ఏపీలో ఖరీఫ్ సాగు 84 శాతమే
AP: ఖరీఫ్ సీజన్‌లో సాగు లక్ష్యం 32.50లక్షల హెక్టార్లు కాగా, 27.44లక్షల హెక్టార్లలోనే(84 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాగు 10%, పత్తి 33%, వేరుశనగ 48% తగ్గింది. పలు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో వర్షాభావం, సకాలంలో వరుణుడు కరుణించకపోవడం వల్ల సాగు లక్ష్యం నెరవేరలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జొన్న, కొర్ర, సజ్జ, కంది, మినుము, పెసర, సన్‌ఫ్లవర్ వంటి పంటల సాగు ఆశాజనకంగా ఉందన్నారు.
Similar News
News October 15, 2024
పార్టీ గుర్తు విషయంలో ఈసీదే అంతిమ నిర్ణయం: శరద్ పవార్
పార్టీ గుర్తుపై ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయమని ఎన్సీపీ-పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ విషయంలో ఈసీ ఆదేశాలను తాము స్వీకరించాల్సిందేనని చెప్పారు. గత ఏడాది పార్టీ రెండుగా విడిపోవడంతో మెజారిటీ ఆధారంగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా శరద్ వర్గానికి ‘బాకా ఊదుతున్న వ్యక్తి’ గుర్తును కేటాయించింది.
News October 15, 2024
బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కసరత్తు
AP: బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. SC, ST అట్రాసిటీ చట్టం మాదిరిగానే BCల కోసం దీన్ని అందుబాటులోకి రానుంది. 8 మంది మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, అనగాని, పార్థసారథి, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సచివాలయంలో విధివిధానాల రూపకల్పనపై చర్చించారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
News October 15, 2024
రేపు క్యాబినెట్ భేటీ.. కీలక పథకానికి ఆమోదం?
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగంపై 5-6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు వస్తాయని తెలుస్తోంది.