News January 30, 2025
ఖవాజా ‘RECORD’ డబుల్ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ చేశారు. 290 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ద్విశతకం బాదారు. ఈ ఆసీస్ బ్యాటర్‌కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కాగా శ్రీలంకలో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 38 ఏళ్ల ఖవాజా ఇప్పటివరకు 79 టెస్ట్ మ్యాచుల్లో 5వేలకు పైగా రన్స్ చేశారు. ఇందులో 15 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి.
Similar News
News February 16, 2025
కొత్త హీరోయిన్‌తో లవ్‌లో పడ్డ రామ్ పోతినేని?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన RAPO22తో బిజీగా ఉండగా ఆ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. లవ్ స్టోరీలో నటిస్తూ ఈ బ్యూటీతో ప్రేమలో పడిపోయాడని పేర్కొన్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలోనూ హీరోయిన్ అనుపమతో రామ్ ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News February 16, 2025
సంచలనం: ఇండియా ఎన్నికల్లో అమెరికా జోక్యం!

అమెరికాలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని DOGE శాఖ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం 21 మిలియన్ డాలర్ల ట్యాక్స్ పేయర్ల డబ్బును వెచ్చించాలని ప్రతిపాదించింది. దీంతో పాటు ఇతర దేశాలకూ ప్రపోజ్ చేసిన నిధులను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. అయితే మన దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యం బయటపడటంతో దీనిపై మోదీ సర్కార్ విచారణ జరిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News February 16, 2025
నేషనల్ అవార్డ్ కోసం వెయిటింగ్: సాయిపల్లవి

నేషనల్ అవార్డ్ అందుకోవాలని తనకు ఎంతో ఆశగా ఉందని హీరోయిన్ సాయిపల్లవి అన్నారు. దానిని అందుకున్న రోజే తన నాయనమ్మ ఇచ్చిన చీర కట్టుకుంటానని చెప్పారు. ‘నాకు 21 ఏళ్లున్నప్పుడు మా నానమ్మ ఓ చీర ఇచ్చింది. దానిని ఏదైనా అవార్డుల ప్రదానోత్సవానికి కట్టుకోవాలని అనుకున్నా. అందుకే జాతీయ అవార్డు వస్తే దానిని ధరిస్తా’ అని చెప్పుకొచ్చారు. కాగా ‘గార్గి’ మూవీకిగాను సాయిపల్లవికి జాతీయ అవార్డ్ వస్తుందని అందరూ భావించారు.