News December 2, 2024

ప్రభాస్ ‘స్పిరిట్‌’లో కియారా స్పెషల్ సాంగ్?

image

సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవలే సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కియారా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే మూవీకి సంబంధించిన అప్డేట్స్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.

Similar News

News April 13, 2026

పాత ఇంట్లో దొరికిన నాణెం.. వేలంలో ₹1.2కోట్లు

image

బ్రిటన్‌ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా పేరుగాంచిన ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ వేలంలో £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికింది. వేల్స్‌లోని ఒక పాత ఇంట్లో దొరికిన ఈ ఐదు పౌండ్ల నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉండటంతో కాయిన్ కలెక్టర్స్ దీనిని నాణేల ప్రపంచంలో ‘హోలీ గ్రెయిల్’(అత్యంత అరుదైనది)గా భావిస్తారు.

News April 13, 2026

బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

image

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.

News April 13, 2026

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు